ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై సోమవారం ఒక టిప్పర్ లారీకి స్టీరింగ్ వదిలేయడంతో వేగంగా ముందుకు దూసుకెళ్లింది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. టిప్పర్ డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. కొండపై చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన పాత ప్రసాదాల కౌంటర్ శిథిలాలను టిప్పర్ల ద్వారా కేశఖండనశాల వెనుక ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే లోడుతో వెళుతున్న ఒక టిప్పర్ స్టీరింగ్ వదిలేయడంతో స్థానిక జంటగోపురాల ప్రాంతంలో వాహనం అదుపుతప్పింది. దీంతో అక్కడున్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది.
డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెనుప్రమాదం