
ఒద్దికై న చేతిరాత మూల్యాంకనం చేసేవారిని ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. బాగా చదివేవారు కూడా చేతిరాత సరిగా లేని కారణంగా ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోతుంటారు. చేతిరాతపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలి. తరచూ కాపీ పుస్తకాలు రాయించాలి.
– ఎన్‌వీ రవిసాగర్, జిల్లా విద్యాశాఖాధికారి
సాధనకు ప్రతిరోజూ కొంత సమయం
విద్యార్థులు చదువుతో పాటు చేతిరాతకు ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించాలి. అక్షరాలు అందంగా అర్థమయ్యేలా ఉండడానికి ఆ సాధన ఉపయోగపడుతుంది. రాసే సమయంలో పదానికి, పదానికి మధ్య కొంత దూరంగా ఉండేలా, చదవడానికి వీలుగా ఉండేలా జాగ్రత్తపడాలి. మార్జిన్‌లో ప్రశ్న సంఖ్యను స్పష్టంగా రాయాలి.
– మజ్జి సూర్యకాంతారావు, చేతిరాత నిపుణులు
మంచి దస్తూరికి ప్రాధాన్యత ఉంటుంది
జవాబుపత్రాల మూల్యాంకనంలో మంచి దస్తూరికి ఎప్పుడూ ప్రాధాన్యత లభిస్తుంది. అక్షరాలు గుండ్రంగా రాసిన వారికి మార్కులు ఎక్కువ పడతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాతపై కూడా విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. వేగంగా, అందంగా రాయడంలో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం.
– సబ్బితి నరసింహమూర్తి, ఏలూరు మండల విద్యాశాఖాధికారి
●

