టీపీఏ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

టీపీఏ ఆవిర్భావ దినోత్సవం

May 6 2026 7:37 AM | Updated on May 6 2026 7:37 AM

కాళోజీ సెంటర్‌: తెలంగాణ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ (టీపీఏ) తొమ్మిదో వార్షికోత్సవాన్ని వరంగల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పోగు అశోక్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శ్రీలత అందె, ఉపాధ్యక్షుడు బొజ్జ సురేశ్‌ కేక్‌ కట్‌ చేసి మాట్లాడారు. సమాజంలో మానసిక రుగ్మతులను రూపుమాపడానికి తెలంగాణ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ విశేషంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సంక్షోభ సమయాల్లోనే సంకల్పాలు పుడతాయని, మానసిక శాస్త్రం నిర్లక్ష్యానికి గురవుతున్న వేళ, సైకాలజిస్టుల గుర్తింపు ప్రశ్నార్థకమైన తరుణంలో తెలంగాణ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. సభ్యులు పవన్‌కుమార్‌, గ్రామీణ పేదరిక నిర్మూలన మండల సమాఖ్య అధ్యక్షురాలు రాధిక, కార్యదర్శి శారద, కోశాధికారి శిల్ప, ఏపీఎం ఈశ్వరయ్య, సీసీలు సురేష్‌, నర్సయ్య, శ్రీలత, అకౌంటెంట్‌ జయంతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement