జాప్యం లేకుండా రుణాలివ్వండి | - | Sakshi
Sakshi News home page

జాప్యం లేకుండా రుణాలివ్వండి

May 6 2026 7:37 AM | Updated on May 6 2026 7:37 AM

జాప్యం లేకుండా రుణాలివ్వండి

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్సీ), జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పురోగతిని బ్యాంకర్లతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. 2025–26 సంవత్సరానికి జిల్లాకు రూ.15,484.29 కోట్ల రుణ లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.13,733.74 కోట్ల మేర సాధించినట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చిన డీఆర్డీఏ అధికారులను అభినందించారు. సమావేశం అనంతరం మహిళా సంఘాలకు రుణాల మంజూరులో కృషి చేసిన ఏపీఎంలు, సీసీలకు కలెక్టర్‌ ప్రశంసపత్రాలు అందజేశారు. అలాగే నాబార్డ్‌ పొటెన్షియల్‌ లింక్డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ 2026–27ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్‌బీఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య, యూపీఐ డీజీఎం కమలాకర్‌, నాబార్డ్‌ ఏజీఎం చంద్రశేఖర్‌, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ జన్ను మహేందర్‌, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్‌ కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేశ్‌, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement