ఓరుగల్లు వేదికగా రైతుపోరు! | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు వేదికగా రైతుపోరు!

May 6 2026 7:37 AM | Updated on May 6 2026 7:37 AM

ఓరుగల్లు వేదికగా రైతుపోరు!

రైతు డిక్లరేషన్‌ను

తుంగలో తొక్కిన కాంగ్రెస్‌

8లోu

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్‌ డైరెక్షన్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు ఆ మేరకు సదస్సులో ఏర్పాట్లు చేశారు. కాగా, వరంగల్‌ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్‌.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది.

విస్తృత ఏర్పాట్లు...

రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్‌ రోడ్డులోని సీఎస్‌ఆర్‌ గార్డెన్‌కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్‌ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ ఎదురుగా ఉన్న ప్రైవేట్‌ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్‌, నర్సంపేట, డోర్నకల్‌, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్‌ గ్రౌండ్‌తో పాటు, భారత్‌ పెట్రోల్‌ బంక్‌కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్‌ఘన్‌పుర్‌, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్‌ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్‌ హాల్‌లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్‌ వాహనాల కోసం పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు

బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్‌ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్‌ నేతలు మంగళవారం ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. ఆతర్వాత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు.

నేడు బీఆర్‌ఎస్‌

రైతు సంగ్రామ సదస్సు

హంటర్‌రోడ్డులో

10వేల మందికి ఏర్పాట్లు

ఉదయం 9 గంటలకే

వచ్చేలా సమీకరణ

మొదట ప్రభుత్వ వైఖరిపై

రైతుల అభిప్రాయాలు

అనంతరం బీఆర్‌ఎస్‌ నేత

కేటీఆర్‌ ప్రసంగం

ప్రతీ పల్లె నుంచి హాజరుకానున్న

రైతు ప్రతినిధులు

గులాబీమయమైన వరంగల్‌ నగరం

పార్టీ మోసాలను ప్రజలకు

వివరించేందుకే రైతు సదస్సు

విలేకరులతో బీఆర్‌ఎస్‌ నేతలు

Advertisement
 
Advertisement
Advertisement