భూసేకరణలో గోల్‌మాల్‌! | - | Sakshi
Sakshi News home page

భూసేకరణలో గోల్‌మాల్‌!

May 5 2026 9:37 AM | Updated on May 5 2026 9:37 AM

భూసేకరణలో గోల్‌మాల్‌!

‘రియల్‌’ వ్యాపారికి పరిహారం డబ్బులు..

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

హసన్‌పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్‌ 353 (ప్లాటు నంబర్‌–64)లో భూమి కలిగిన డి.వర్షారావు తనకు నష్టపరిహారం అందించలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని హైకోర్టును ఆశ్రయించింది. ఆర్డీఓ ప్రొసీడింగ్‌ నంబర్‌ ఎఫ్‌/4438/2012 తేదీ 31–3–2016 దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించింది. భూమికి డబ్బులు చెల్లించామని, తమ వద్ద డబ్బులు లేవని ఆర్డీఓ సమాధానం ఇచ్చారు.

...ఇలా 353 సర్వే నంబర్‌ (4.30 ఎకరాలు)లో 19,223.253 చదరపు గజాల భూసేకరణ చేపట్టారని, ఇందుకు ప్రభుత్వం రూ.9,54,93,576 నిధులు పక్కదారి పట్టాయి.

భూసేకరణ పేరిట నిధులు స్వాహా..

కథా కమామీషు ఇదీ..

యాదాద్రి–ఆరెపల్లి జాతీయ రహదారి భూసేకరణలో భారీగా నిధుల గోల్‌మాల్‌ జరిగింది. ఈ రోడ్డు మార్గమధ్యలోని భీమారం, చింతగట్లు, వంగపహాడ్‌, దేవన్నపేటలో పెద్ద ఎత్తున డబ్బులు మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నష్టపరిహారం జాబితాలో భూమి కోల్పోయిన బాధితుల పేర్లు పేర్కొనకుండా అపరిచిత వ్యక్తులుగా పొందుపరచడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2016లో యాదాద్రి–ఆరెపల్లి–163 జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం సందర్భంగా రైతుల నుంచి గ్రామాల వారీగా భూములు సేకరించారు. అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం రైతులకు నష్టపరిహారం అందించారు. హసన్‌పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్‌ 353 (ప్లాటు నంబర్‌–64) యజమానురాలు డి.వర్షారావు తనకు నష్టపరిహారం అందించలేదని హైకోర్టును ఆశ్రయించింది. ఆర్డీఓ ప్రొసీడింగ్‌ నంబర్‌ ఎఫ్‌/4438/2012 తేదీ 31–3–2016 దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించింది.

కలెక్టర్‌ దృష్టికెళ్లకుండా జాగ్రత్త.. ఆర్‌ఆర్‌యాక్టుకు జంకుతున్న ‘రెవెన్యూ’..

రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌ ప్లాట్లు, రోడ్లు, గ్రీన్‌ల్యాండ్‌ను భూసేకరణ కింద చూపి అక్రమంగా రూ.9.55 కోట్లు ‘అన్నౌన్‌’ పేరిట ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి రెవెన్యూ అధికారులు చెల్లించారు. ఆ డబ్బులను రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నా స్పందించడం లేదు. 2022–23 వరకు ఆర్డీఓగా ఉన్న అధికారి దృష్టికి రైతులు తీసుకెళ్లారు. సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చామని, త్వరలోనే వసూలు చేస్తామని చెప్పినా ఆమలు కాలేదు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లోనూ అప్పట్లో బాధితులు ఫిర్యాదు చేయగా.. అప్పుడున్న కలెక్టర్‌ను ఆర్డీఓ స్థాయి అధికారి ఒకరు తప్పుదోవ పట్టించారన్న ప్రచారం ఉంది. అధికారులు మారినప్పుడల్లా బాధితులు రూ.9.55 కోట్ల అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నా ఆర్డీఓ, తహసీల్దార్‌ స్థాయి అధికారులు కలెక్టర్లకు తప్పుడు సమాచారం ఇస్తూ దాటవేస్తున్నారని అంటున్నారు. నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్న హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఈ వ్యవహారంపై స్పందించి ప్రభుత్వ ఖజానాకు రూ.9.54 కోట్లు లూటీ చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్‌ఆర్‌ యాక్టు ద్వారా డబ్బులు రికవరీకి చేయాలని కోరుతున్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు నష్టపరిహారం అందించామని ఆర్డీఓ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆర్డీఓ ప్రొసీడింగ్‌ నంబర్‌ ఎఫ్‌/4438/ 2012 తేదీ 31–3–2016 ప్రకారం 353 సర్వే నంబర్‌ భూమి (4.30 ఎకరాలు) 19223.253 చదరపు గజాల భూసేకరణ చేపట్టారని ఇందుకు ప్రభుత్వం ద్వారా రూ.9,54,93,576 చెల్లించామని చెప్పారు. తమ వద్ద డబ్బులు లేవని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాధితురాలు వర్షారావుకు మెమో ద్వారా తెలిపారు. అయితే ఆర్డీఓ రమేశ్‌ రాఽఽథోడ్‌ మాత్రం సర్వేనంబర్‌ 353లో మొత్తం 19223.253 చదరపు గజాలు సేకరించి డబ్బులు చెల్లించినట్లు లేఖలో వివరించారే తప్ప బాధితుల పేర్లు మాత్రం అందులో పేర్కొనలేదు. నష్టపరిహార జాబితాలో భూమి కోల్పోయిన బాధితుల పేర్లు పేర్కొనకుండా అపరిచిత వ్యక్తిగా పొందుపరచడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అపరిచిత వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించినట్లు పేర్కొనడం ద్వారా అవినీతికి పాల్పడినట్లు ఇక్కడ ఉన్న ఆధారాల ద్వారా స్పష్టమవుతోంది.

అక్షరాల రూ.9,54,93,576 నిధులు స్వాహా

పరిహారం కోసం

కోర్టుకు బాధితులు

అప్పటి అధికారుల తీరుపై

అనుమానాలు

డబ్బులిచ్చామని ఆర్డీఓ వివరణ

అపరిచితుల పేరిట రియల్టర్‌కు

చెల్లింపులు

Advertisement
 
Advertisement
Advertisement