హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ వరంగల్ మిల్క్ షెడ్ డిప్యూటీ డైరెక్టర్‌గా జి.ధన్‌రాజ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీడీగా విధులు నిర్వర్తించిన శ్రవణ్‌కుమార్‌ను మెగా డెయిరీ మార్కెటింగ్ జీఎంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ధనరాజ్‌ను డీడీగా నియమిస్తూ ఏప్రిల్ 25న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నూతన డీడీగా బాధ్యతలు స్వీకరించిన ధన్‌రాజ్‌ను విజయ డెయిరీ పాడి రైతుల సంక్షేమ, పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇరుకు దేవేందర్ రావు, బీఎంసీయూ అధ్యక్షులు రాసాల సమ్మయ్య, మెట్టు సురేందర్, గోపాల్ అభినందించారు.
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని హనుమకొండ జిల్లా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీఓస్ నాయకులు సోమవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞ్ఞతలు తెలిపారు. జేఎసీ, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, నేతలు ఈవీ శ్రీనివాస్, బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యాంసుందర్, కత్తి రమేశ్, రామునాయక్, సారంగపాణి, లక్ష్మీప్రసాద్, సీతారాం, సలీం, రాజమౌళి, సురేశ్, రాజేశ్ ఖన్నా, భరత్, శ్రీనివాస్, రాజీవ్ అనూప్, ఎర్రాప్రగడ, రాజే శ్, ఉప్పు భాస్కర్, వెంకట్రామిరెడ్డి, మల్లేశం, మన్సూర్, సాంబయ్య, రంజిత్ పాల్గొన్నారు. .
రామన్నపేట: పీసీ పీఎన్డీటీ, ఎంటీపీ చట్టం నియమాలను డాక్టర్లు తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పీడీ అండ్ పీఎన్‌డీటీ జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీఎంహెచ్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల, పరకాల సీహెచ్‌సీ గైనకాలజిస్ట్ కవిత, జిల్లా అడ్వైజరీ కమిటీ సభ్యులు రేవతి దేవి, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రూబీనా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తాళ్లూరి లత, రాజు, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, ప్రసన్నకుమార్, హెల్త్ సూపర్‌వైజర్ పద్మజ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు. హనుమకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ రాథోడ్ రమేశ్, పరకాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు వినిపించిన సమస్యలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓలు తెలిపారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో 10 దరఖాస్తులు, పరకాల ఆర్డీఓ కార్యాలయంలో 27 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీఓలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


