హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ప్రతి వినతిని సంబంధిత పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని, అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలని సూచించారు. వారంలో వినతుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కాగా, ప్రజావాణికి మొత్తం 143 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్‌ఓ సత్యపాల్, డీఆర్డీఓ శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు
వినతులు త్వరగా పరిష్కరించండి:
కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, సమస్యలను పరిష్కరించిన వాటిని ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.
ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
రెవెన్యూ డివిజన్ స్థాయిలో మొదటిసారిగా నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజావాణికి 101, వరంగల్ డివిజన్‌లో 26, నర్సంపేట డివిజన్‌లో 14 దరఖాస్తులు సమర్పించినట్లు వెల్లడించారు. ఇందులో రెవెన్యూ 63, హౌసింగ్ 14, జీడబ్ల్యూఎంసీ 18 దరఖాస్తులు రాగా ఇతర శాఖలకు సంబంధించి 46 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ నాగపద్మజ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


