అధికారి కుటుంబానికి అండగా ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

అధికారి కుటుంబానికి అండగా ఉద్యోగులు

May 5 2026 9:37 AM | Updated on May 5 2026 9:37 AM

అధికారి కుటుంబానికి అండగా ఉద్యోగులు

పరకాల: హైదరాబాద్‌ ఔషధ తనిఖీ అధికారిగా పనిచేస్తూ గుండెపోటుతో మృతిచెందిన పరకాల పట్టణానికి చెందిన గుండు శ్రీకాంత్‌ కుటుంబానికి డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆఫీసర్స్‌ ఇండియా వేల్ఫేర్‌ అసోసియేషన్‌ అండగా నిలిచింది. ఈ మేరకు సోమవారం డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆఫీసర్స్‌ ఇండియా వేల్ఫేర్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు గుండమీది కోటేశ్వర్‌రావు, డ్రగ్స్‌ కంట్రోల్‌ కార్యాలయ ఉద్యోగులు శ్రీకాంత్‌ కుటుంబాన్ని పరామర్శించారు. డ్రగ్స్‌ కంట్రోల్‌ ఆఫీసర్స్‌ వేల్ఫేర్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.2 లక్షల చెక్కును శ్రీకాంత్‌ భార్య లక్ష్మికి అందించారు. తోటి అధికారుల సహకారంతో వారి పిల్లల కోసం రూ.15 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసినట్లు కోటేశ్వర్‌రావు తెలిపారు.

రూ.2 లక్షల చెక్కు అందజేత

రూ.15 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌

Advertisement
 
Advertisement
Advertisement