టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో మార్పులు

May 5 2026 9:37 AM | Updated on May 5 2026 9:37 AM

టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో మార్పులు

కేయూ క్యాంపస్‌: టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో వినూత్న మార్పులు వచ్చాయని గుజరాత్‌ రాష్ట్రంలోని ఇన్‌ఫ్లిబినెట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దేవికా పి.మదల్లి అన్నారు. కేయూలో లైబ్రరీ అసిస్టెంట్లకు సోమవారం నిర్వహించిన ఇన్‌ఫ్లిబినెట్‌ రీజినల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం లైబ్రరీ ఆటోమేషన్‌ ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడారు. వన్‌నేషన్‌ ఇన్‌ సబ్‌స్క్రిప్షన్‌ కార్యక్రమం కింద సుమారు 6,500 సంస్థలు నమోదు చేసుకున్నామని పేర్కొన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ లైబ్రరీకి రూసా నిధుల కింద రూ.2 కోట్లు, ప్రాజెక్టు కింద రూ.49 లక్షలు, సాధారణ బడ్జెట్‌లో రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్లు ఏఆర్‌డీ ప్రసాద్‌, నిట్‌ లైబ్రేరియన్‌ ప్రొఫెసర్‌ వై.శ్రీనివాస్‌రావు, సోషల్‌ సైన్స్‌, ఆర్ట్స్‌ డీన్‌ బి.సురేశ్‌లాల్‌, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు కేయూ లెబ్రరీ సైన్స్‌ విభాగాధిపతి రాధికారాణి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి రమ, నీలిమ, రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement