వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
మక్క రైతుల

పంట అమ్ముకునేందుకు రోజులకొద్ది ఎదురుచూపులు

నల్లబెల్లి, నర్సంపేట, వర్ధన్నపేటలో మాత్రమే మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో 46వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు

డాక్యుమెంట్‌ రైటర్లపై

ఏసీబీ నజర్‌!

వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అవినీతికి కారణమైన డాక్యుమెంట్‌ రైటర్లపై ఏసీబీ నిఘా పెంచింది.

నర్సంపేట: జిల్లాలో వరి పంట తర్వాత రైతులు యాసంగిలో మొక్కజొన్న పంట ఎక్కువ సాగుచేశారు. భారీగా పెట్టుబడి పెట్టి పంట చేతికందిన తర్వాత విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 46 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగైంది. కిలో విత్తన మక్కలకు రూ.200 నుంచి రూ.600 వరకు రైతులు వెచ్చించారు. ఎకరాకు 8 నుంచి 16 కిలోల విత్తనాలు విత్తారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.40వేల పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 18 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌, నల్లబెల్లి మండల కేంద్రం, వర్ధన్నపేటలో మాత్రమే అధికారులు మార్క్‌ఫెడ్‌ మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ఉంది. ప్రస్తుతం నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలోని మార్క్‌ఫెడ్‌ కేంద్రం మక్కలతో నిండిపోయింది. ఒకే కొనుగోలు కేంద్రం మాత్రమే ఉండడంతో ఒక్కో రైతు వారం రోజులపాటు మక్కలు విక్రయించుకునేందుకు ఎదురు చూడాల్సిన పరిస్థి తి నెలకొంది. చేసేదేమిలేక కొంతమంది రైతులు తక్కువ ధరకే ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రూ.1,600 నుంచి రూ.1,900 ధరకు ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ.500 నుంచి రూ.800 వరకు రైతులు నష్టపోతున్నారు. పంటను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన మక్కలు

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అజ్మీరా బుజ్జమ్మ. నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామ శివారులోని చక్రంతండాలో తనకు ఉన్న నాలుగు ఎకరాల్లో మక్కజొన్న సాగు చేసింది. బావిలో నీరు సరిపోకపోవడంతో ఎకరంన్నర విస్తీర్ణంలో మక్కజొన్న పంట ఎండిపోయింది. మిగిలిన మక్కజొన్న పంటను మిషన్‌ ద్వారా పట్టి వారం రోజుల క్రితం నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు అమ్మేందుకు తీసుకొచ్చి ఆరబెట్టింది. ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడంతో మార్కెట్‌ కార్యాలయం ఆవరణలోనే తన మనడు మోహన్‌తో కలిసి వంద బస్తాల మక్కలను అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతోంది. ఇలాంటి పరిస్థితి వందలాది మంది రైతులకు ఎదురవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement