స్కిక్కర్లకు లెక్క ఉందా? | - | Sakshi
Sakshi News home page

స్కిక్కర్లకు లెక్క ఉందా?

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

స్కిక్కర్లకు లెక్క ఉందా?

వాస్తవానికి వాహనానికి ఎంత సైజులో స్టిక్కర్‌ వేస్తారు? ఏ వాహనానికి ఎంత చెల్లించాలి. తదితర వివరాలతో కాంట్రాక్టర్‌ కార్యాలయంలో ఫ్లెక్సీలు ప్రదర్శించాలి. అవేమీ లేకుండానే వసూళ్లకు పాల్ప డడంతో కాంట్రాక్టర్‌కు సంబంధించిన సిబ్బంది అడిగినంత చెల్లించాల్సి వస్తోందని లారీ యజమానులు వాపోతున్నారు. స్టిక్కర్లు వేయడానికి వసూలు చేసే డబ్బుతో రవాణా శాఖ అధికారులకు సంబంధం లేకపోయినా నిబంధనలు పాటించేలా అధికారులు చొరవ చూపాల్సి ఉంది. కానీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఈవిషయమై జిల్లా రవాణాశాఖ అధికారి శోభన్‌ బాబును వివరణ కోరగా.. తీసుకున్న డబ్బుకు బిల్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బిల్లు ఇవ్వకపోతే వాహనదారులు డబ్బులు చెల్లించవద్దని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement