శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలి
విద్యారణ్యపురి: భారతదేశం శాస్త్రసాంకేతక రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తే విశ్వగురువుగా కీర్తించే అవకాశం ఉంటుందని ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని సేయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్‌లో జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని నూతన ఆలోచనలు సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు వేదికలవుతాయన్నారు. తాను సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి వచ్చే ఏడాది సైన్స్ ఫెయిర్ నాటికి జిల్లా సైన్స్‌కేంద్రం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.
విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడమే
ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సైన్స్‌ఫెయిర్ అంటే ఒక మోడల్‌ను.. ఒక ఎగ్జిబిట్‌ను ప్రదర్శించడం కాదని పరస్పర విజ్ఞానాన్ని షేర్ చేసుకోవడమేనని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో పరిశోధకులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సైన్స్ ఫెయిర్‌లు దోహదం చేస్తాయన్నారు. అనంతరం డీఈఓ గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ సైన్స్‌ఫెయిర్, ఇన్‌స్పైర్‌లో విద్యార్థులు ప్రదర్శనలను తిలకించాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ మేన శ్రీను, స్థానిక కార్పొటర్ నల్లా స్వరూపరాణి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్‌స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ హరిత, వడుప్సా బాధ్యుడు మాదాల సతీశ్‌కుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, హసన్‌పర్తి ఎంఈఓ ఎ.శ్రీనివాస్, కాజీపేట ఎంఈఓ బి.మనోజ్‌కుమార్, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు బద్దం సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ మన్‌మోహన్, బి.మహేశ్, సునీత, ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
పింగిళిశ్రీపాల్‌రెడ్డి
వైజ్ఞానిక ప్రదర్శనలతో
సృజనాత్మక ప్రతిభ


