అంగన్‌వాడీ సెంటర్ తనిఖీ
ఖిలా వరంగల్: వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ బీఆర్‌నగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఏఎస్పీ శుభం ప్రకాశ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని లబ్ధిదారులకు అందించాలని అంగన్‌వాడీ టీచర్‌కు సూచించారు. మంత్రి వెంట తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు ఉన్నారు.
రామన్నపేట: నగరంలోని వరంగల్ – నర్సంపేట రోడ్డు రాంకీ గేటు ఎదుట శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో లోహిత హాస్పిటల్‌కు చెందిన అంబులెన్స్ డ్రైవర్‌కు బ్రీత్ ఆనలైజర్ టెస్ట్ నిర్వహించగా 226 రీడింగ్ నమోదైంది. అత్యవసర సేవలకు ఉపయోగించే అంబులెన్‌న్స్‌ను మద్యం సేవించి నడపడం తీవ్ర నిర్లక్ష్యమని భావించిన పోలీసులు వెంటనే వాహనాన్ని నిలిపేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.


