ఉత్సాహంగా హెల్త్ రన్
పబ్లిక్ గార్డెన్ జంక్షన్‌లో వైద్య విద్యార్థుల ఫ్లాష్‌మాబ్
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఉత్కర్ష–25 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా వైద్యవిద్యార్థులు మహిళల ఆరోగ్యంపై హెల్త్ రన్ నిర్వహించడంతో పాటు ప్లాష్ మాబ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈహెల్త్ రన్ కేఎంసీ ప్రధాన గేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కొనసాగగా.. ఈ రన్‌ను కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య అనిల్, ఐఎంఏ వైద్యులు, అధ్యాపకులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ చౌరస్తాలో వైద్యవిద్యార్థులు స్కిట్స్, డ్సాన్స్‌ల ప్రదర్శనతో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం క్విట్, పెయింటింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించగా.. సాయంత్రం వైద్యవిద్యార్థులు నిర్వహించిన షార్ట్ ఫిలింస్ అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎస్‌ఐ శ్రీనివాస్, ఐఎంఏ ప్రతినిధులు కూరపాటి రమేశ్, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా ఆరోగ్యంపై ఫ్లాష్‌మాబ్


