విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
కాళోజీ సెంటర్: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) ఉండ్రాతి సుజన్‌తేజ సూచించారు. జిల్లావిద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం వరంగల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జానపద నృత్యపోటీలు నిర్వహించారు. సుజన్‌తేజ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తేవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. నెక్కొండ కేజీబీవీ ప్రథమ, చెన్నారావుపేట కేజీబీవీ ద్వితీయ, రాయపర్తి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతలుగా పరమేశ్వర్, చైతన్య వ్యవహరించారు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, హెచ్‌ఎం శారదాబాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


