అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలి
రాయపర్తి: సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై వచ్చే ప్రచారాన్ని ఎండగట్టి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ తొర్రూరు అధ్యక్షుడు జాటోత్ హామ్యానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ బండి రాజేంద్రప్రసాద్, టౌన్ కోఆర్డినేటర్ ఉబ్బని నవీన్, కోకోఆర్డినేటర్ గుగులోత్ వెంకన్న, అన్ని గ్రామాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి


