ముగిసిన వైన్స్ దరఖాస్తుల స్వీకరణ
కాజీపేట అర్బన్: వైన్స్ దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 18న చివరి తేదీ ఉండగా.. గడువును 23వ తేదీ వరకు పెంచారు. పెంచిన గడువు చివరి రోజు గురువారం వరంగల్ అర్బన్ 67 వైన్స్‌కు 139 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ల ప్రకటన నుంచి గురువారం వరకు 3,175 దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా వరంగల్ రూరల్ 63 వైన్స్‌కు ఆఖరి రోజు గురువారం 103 దరఖాస్తులు రాగా, మొత్తం 1,934 దరఖాస్తులను మద్యం వ్యాపారులు రాత్రి 10:30 గంటల వరకు అందజేశారు. ఈనెల 27న వైన్స్ లక్కీడ్రాగా నిర్ణయించారు.
ఆఖరి రోజు వరంగల్ అర్బన్ 139,
వరంగల్ రూరల్ 103


