ఉపాధికి ప్రణాళికలు
జిల్లా సమాచారం..
2026–27 సంవత్సరానికి పనుల గుర్తింపు
సంగెం: గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించిన పనులను గుర్తించేందుకు అధికారులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమయ్యే పనులను గుర్తించి తీర్మానాలు చేస్తున్నారు. జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి 2.39 లక్షల జాబ్‌కార్డులు మంజూ రు చేయగా.. ఇందులో 74,576 యాక్టివ్ జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 1,23,701 మంది కూలీలు ఉన్నారు. వీరందరికి వంద రోజుల పని కల్పించనున్నారు. కనీసం రోజుకు రూ.300 కూలి పడేటట్లు అధికారులు ప్రణాళికలు రుపొందిస్తున్నారు. వచ్చే నవంబర్ 30 నాటికి అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తి చేస్తామని ఈజీఎస్ అధికారులు తెలిపారు.
చేపట్టే పనులు ఇలా..
జాబ్‌కార్డులు కలిగి వ్యవసాయ భూములున్న రైతుల కోసం పనులు చేపట్టనున్నారు. జామ, నిమ్మ, మామిడి, దానిమ్మ, సీతాఫల్, డ్రాగన్‌ప్రూట్, మునగ, కొబ్బరి, అయిల్‌పామ్, జామాయిల్, గడ్డి పెంపకం, గొర్లషెడ్డు, పశువుల షెడ్ల నిర్మాణం, రైతుల భూములకు వెళ్లేందుకు మట్టి రోడ్డు, ఫారంపాండ్, చేపల చెరువుల తవ్వకం, ఎస్సీ, ఎస్టీల భూముల లేవలింగ్, జంగిల్ కటింగ్, కొత్త బావుల తవ్వకం, పాత బావుల పూడికతీత, ఇంకుడు గుంతలు, కంపోస్ట్ ఎరువుల గుంత, భూమి చుట్టూ కందకాలు, నాడెపు కంపోస్ట్, మట్టి కట్టలు, వ్యక్తిగత నర్సరీల పెంపకం, అజోలా గడ్డి పెంపకం వంటి పనులను అధికారులు గుర్తిస్తున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు అవసరం అవుతాయో అలాంటి పనులను గుర్తించేందుకు అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు తీసుకుంటున్నాం. స్థానిక అవసరాలు, రైతుల వ్యక్తిగత అవసరాలను ముందుగానే గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామసభల్లో చేయాల్సిన పనుల వివరాలతో ప్రణాళికలు రుపొందించి జిల్లా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటాం. మంజూరు రాగానే గ్రామాల్లో పనులు చేపట్టి కూలీలకు ఉపాధి హామీ పనులు స్తాం.
– కాసర్ల రవీందర్, ఎంపీడీఓ సంగెం
గ్రామీణ మండలాలు 11
గ్రామ పంచాయతీలు 325
జాబ్‌కార్డులు 2.39 లక్షలు
యాక్టివ్ కార్డులు 74,576
కూలీలు 1,23,701 మంది
నవంబర్ 30 వరకు
గ్రామసభల తీర్మానాలు
కూలీకి రోజుకు
రూ.300 చెల్లించనున్న అధికారులు
ఉపాధికి ప్రణాళికలు


