రైతులకు ఉపయోగం కపాస్ కిసాన్
దుగ్గొండి: పత్తిని సీసీఐకి అమ్ముకోవడానికి రైతులకు కపాస్ కిసాన్ యాప్ ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని దేశాయిపల్లి, ముద్దునూరు, బంధంపల్లి గ్రామాల్లో పత్తి రైతులకు గురువారం కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, ఆధార్‌భూమి రికార్డుల ద్వారా నమోదు చేసుకోవడం వంటి సదుపాయాలు యాప్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్లే స్టోర్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్, భూమి రికార్డులు, పంట రకం, విస్తీర్ణం నమోదు చేయాలన్నారు. పత్తి ఏ రోజు అమ్మాలనుకుంటున్నారో ఆ తేదీ నమోదు చేయాలని సూచించారు. పత్తిని ప్లాస్టిక్ సంచులు, గోనె సంచుల్లో కాకుండా విడిగా తీసుకురావాలని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా పత్తిని క్వింటాలుకు రూ.8,110 చొప్పున విక్రయించుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఏఓ మాధవి, ఏఈఓలు హనుమంతు, విజయ్‌నాయక్, రాజేశ్, పత్తి రైతులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల తనిఖీ..
దేశాయిపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఎంత మంది పిల్ల లు ఉన్నారు, బాలింతలు, గర్భిణుల వివరాలను పరిశీలించారు. పోషకాహారం వండడం లేదని గుర్తించి టీచర్, ఆయాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి చిన్నారులు, గర్భిణులకు భోజనం అందించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు రిజిష్టర్, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. 7వ తరగతి వరకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని హెచ్‌ఎం రవికుమార్‌ను ప్రశ్నించారు. నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ విద్యాసంస్థలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రీన్‌ఫీల్డ్ రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న నెక్కొండ మండలంలోని పత్తిపాక, వెంకటాపూర్ రైతులతో కలెక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్‌లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎన్‌హెచ్ ఇంజనీరింగ్ అధికారి భూక్యా ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు.
ఈఆర్‌సీ చైర్మన్లను కలిసిన కలెక్టర్
నగర పర్యటనకు వచ్చిన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు విశ్వజిత్‌ఖన్నా, అరవింద్‌కుమార్‌ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు.
కలెక్టర్ సత్యశారద
రైతులకు ఉపయోగం కపాస్ కిసాన్


