దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట: స్వల్పకాలిక కోర్సుల్లో (ఐటీ) ట్రైనింగ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి అర్హత గల శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తులు ఆఽహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు తగిన ధ్రువపత్రాలతో వచ్చేనెల 6లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని షరీఫన్ మసీదు దగ్గర ఉన్న జిల్లా మైనారిటీ కార్యాలయం లేదా 9490151718 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
గీసుకొండ: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని గీసుకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. గ్రేటర్ వరంగల్ ధర్మారం శివారులో ఎస్సై కె.కుమార్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా బిహార్‌కు చెందిన మోహన్‌కుమార్ చేతిలో కవర్‌తో వారికి తారసపడ్డాడు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఎస్సై అతడిని పట్టుకుని పరిశీలించారు. కవర్‌లో 40 గ్రాముల ఎండు గంజాయితోపాటు మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఇన్‌స్పెక్టర్‌కు నివేదించగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పర్వతగిరి: సీడ్ పేరుతో నట్టేట ముంచారని రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరిలో సుమారు 200 మంది రైతులకు ఓ కంపెనీ వారు రబీలో వరి విత్తనాలను విక్రయించారు. పండించిన పంటను కంపెనీ ప్రతినిధులే కొనుగోలు చేశారు. ఏడు నెలలుగా రూ.1.30 కోట్లకు రూ.60 లక్షల వరకు చెల్లించారని, మిగతా రూ.70 లక్షలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు తెలిపారు. మోసం చేసిన సీడ్ కంపెనీపై గురువారం పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.
గీసుకొండ: పొదుపు సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని అడిషనల్ డీఆర్‌డీఓ రేణుకాదేవి సూచించారు. కొనాయమాకుల ప్రగతి మండల సమాఖ్య కార్యాలయంలో సెర్ప్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఫుడ్‌సేఫ్టీ ఇండియా సహకారంతో గురువారం పీఎం ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫుడ్‌సేఫ్టీ ఇండియా మేనేజర్ రఘువర్మ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వరలక్మి, ఏపీఎంలు ముక్కెర ఈశ్వర్, రాజ్‌కుమార్, సమాఖ్య కార్యదర్శి శారద, కోశాధికారి శిల్ప, సీసీలు సురేశ్, రాజయ్య, కుమారస్వామి, నర్సయ్య, శ్రీలత, కృష్ణమూర్తి, రవీందర్ రాజ్, ట్రైనర్ సాగర్, రాణి, జయంతిక, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–25 నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న టెక్ ఫెస్ట్ ఈ ఏడాది రెండు రోజులు శుక్ర, శనివారాల్లో నిర్వహించేందుకు నిర్ణయించారు. శుక్రవారం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్ మాధవీలత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు మెకా వెహికిల్ ఎగ్జిబిషన్, నియాన్ క్రికెట్, కిట్ అసెంబ్లీ, సుమో వార్, డ్యాన్స్ ఓ, వరంగల్ రింగ్ వంటి వివిధ రకాల స్పాట్ లైట్, సెమినార్స్‌తో అలరించనుంది. కాగా, టెక్‌ఫెస్ట్–25లో దేశవ్యాప్త వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏడు వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చేసుకోవాలి


