
మల్లన్న ఆలయంలో సహస్ర దీపాలంకరణ
ఐనవోలు : ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా మంగళవారం సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు, సిబ్బంది ముందుగా గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు ఎదురుగా నజర్ పట్నం వేసే ప్రాంతంలో స్వస్తిక్ ఆకృతిలో దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయం చుట్టూ సుమారు నాలుగు వేల దీపాలు వెలిగించినట్లు ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. అర్చకులు రవీందర్, శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, నందనం భాను ప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేష్ శర్మ, దేవేందర్, భక్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయంలో సహస్ర దీపాలంకరణ