
నిర్వహణ భారంగా మారింది..
ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం చెల్లించే కమీషన్ రాకపోవడం, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ ఇవ్వకపోవడంతో దుకాణాల నిర్వహణ భారంగా మారింది. అప్పులు చేసి కుటుంబాలను పోసిస్తున్నాం. ఈ నెలలో పండుగలు వచ్చాయి. మా ఇబ్బందులు అర్థం చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే కమీషన్ చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం డీలర్లకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి.
– గోరంట్ల వెంకట్‌నారాయణ, రేషన్ డీలర్ల
సంక్షేమ సంఘం నెక్కొండ మండల అధ్యక్షుడు
కేంద్రానిది కపట ప్రేమ..
రేషన్ డీలర్లపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపడం సరికాదు. ఉచిత బియ్యం పంపిణీలో రేషన్ డీలర్లు క్షేత్రస్థాయిలో సేవలందించి ప్రభుత్వాలకు మంచి పేరు తెచ్చారు. అయినా డీలర్లకు అందాల్సిన కమీషన్ డబ్బుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ సెప్టెంబర్ నెలతో కలుపుకొని ఆరు నెలల కమీషన్ రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు నెలల కమీషన్ చెల్లించాల్సి ఉంది.
– మోహన్‌నాయక్,
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు

నిర్వహణ భారంగా మారింది..