రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత | - | Sakshi
Sakshi News home page

రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత

Oct 13 2025 6:05 AM | Updated on Oct 13 2025 6:05 AM

రెండు

రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత

కలెక్టర్‌ సత్యశారద

పుప్పాలగుట్ట పీహెచ్‌సీలో పల్స్‌పోలియో పర్యవేక్షణ

ఖిలా వరంగల్‌: రెండు పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. పల్స్‌ పోలియో సందర్భంగా ఆదివారం వరంగల్‌ 35వ డివిజన్‌ పుప్పాలగుట్ట పీహెచ్‌సీ కేంద్రంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం చుక్కల మందు వేయించని చిన్నారుల ఇళ్లకు వెళ్లి బ్బంది పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన పిల్లలే రేపటి దేవానికి సంపదని పిల్లల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరినారు. గర్భిణులు, చిన్న పిల్లల్లో రక్తహీనత సమస్యలు ఉంటే వైద్యారోగ్య శాఖ సిబ్బంది ద్వారా పరీక్షలు నిర్వహించుకుని తగిన చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా వైద్యశాఖ అధికారి సాంబశివరావు మాట్లాడారు. జిల్లాలో 12 నుంచి 15వరకు స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రకాశ్‌, స్థానిక కార్పొరేటర్‌ సోమిశెట్టి ప్రవీణ్‌ కుమార్‌, ఎస్‌ఎన్‌ఐ ప్రోగ్రాం ఇన్‌చార్జ్‌ ప్రసాద్‌, డీవైఓ ప్రకాశ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కొమురయ్య, పుప్పాల గుట్ట హెల్త్‌సెంటర్‌ డాక్టర్‌ బజ్జూరి దిలిప్‌ పాల్గొన్నారు.

పల్స్‌ పోలియో సక్కెస్‌..

గీసుకొండ: వరంగల్‌ నగర పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. 0–5 ఏళ్లలోపు చిన్నారులు నగరంలో 20,121 మంది ఉన్నట్లు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో 20,128 (స్థానికేతరులతో కలిపి) మందికి చుక్కల మందు వేసినట్లు ఆయన వెల్లడించారు.

రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత 1
1/1

రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement