
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
వేలేరు: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి అన్నారు. శనివారం వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో ఆమె ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడుతూ.. మహిళలకు 10 రోజలు పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జిల్లా మొత్తం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడ, మగ సమానమని, ఎవరైనా బ్రూణ హత్యలకు పాల్పడినట్లు తెలిస్తే వైద్యారోగ్య శాఖ వాట్సాప్ నం 63000 30940, 100, 1098, 181టోల్ ఫ్రీ నంబర్‌లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. మాతా శిశు సంక్షేమ ప్రోగాం అధికారి మంజుల మాట్లాడుతూ.. మండలంలో 1,000 మంది బాలురకు 932 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. మొదట ఒక ఆడపిల్ల ఉన్న కుటుంబంపై రెండో కాన్పులో నిఘా పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైధ్యాధికారి మేఘన, ఆయుష్ డాక్టర్ మమత, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ కళ్యాణి, సూపర్‌వైజర్ ఝాన్సీ, హెచ్‌ఈఓ వెంకటేశ్వర్లు,రాజేశ్వర్ రెడ్డి, స్వర్ణలత, లావణ్య, ఏఎన్‌ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి