
ఐదు నియోజకవర్గ స్థానాలకు 11 నామినేషన్లు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్‌లో సోమవారం ఐదు నియోజకవర్గ (డైరెక్టర్) స్థానాలకు 11 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు ఎన్నికల అధికారి కోదండ రాములు తెలిపారు. 1వ నియోజకవర్గంలో 2 నామినేషన్లు. ఒకటి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రెండు దొంగల చిన్న వెంకట్రాజం. 2వ నియోజకవర్గంలో 2 నామినేషన్లు. బొల్లంపల్లి కుమారస్వామి, కడారి ఆదామ్. 5వ నియోజకవర్గంలో 2 నామినేషన్లు రాగా ఇందులో.. గనవేన శ్రీనివాస్, కూన కనకయ్య, 9వ నియోజకవర్గంలో గుర్రాల భాస్కర్‌రెడ్డి, మార్పాటి జయపాల్‌రెడ్డి, బోయినపల్లి రత్నాకర్‌రావు ఉన్నారు. 15వ నియోజకవర్గంలో 2 నామినేషన్లు. ఒకటి కాసిరెడ్డి వసంత, కంకల భాగ్య ఉన్నారు. కాగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి వర్గం నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయల్దేరి సొసైటీ బ్యాంకుకు చేరుకుని నామినేషన్ వేశారు. దీంతో ఎన్నికల సందడి మొదలైంది. కాగా.. నేడు(మంగళవారం) నామినేషన్ల పరిశీలన, బుధవారం ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఏప్రిల్ 24న ఎన్నికల నగారా మోగిన విషయం విదితమే. కాగా గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది. 27న పోలింగ్, అదేరోజు ఎన్నికల కౌటింగ్, పలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.
● నేడు పరిశీలన, రేపు ఉపసంహరణ