‘హైపర్‌’తో సత్వర సేవలు | - | Sakshi
Sakshi News home page

‘హైపర్‌’తో సత్వర సేవలు

Mar 22 2025 12:58 AM | Updated on Mar 22 2025 12:58 AM

‘హైపర్‌’తో సత్వర సేవలు

‘హైపర్‌’తో సత్వర సేవలు

హన్మకొండ: హైపర్‌తో సత్వర సేవలు అందిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ, వరంగల్‌ ఎస్‌ఈలు పి.మధుసూదన్‌రావు, కె.గౌతం రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి వైపరీ త్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినపుడు అతి తక్కువ సమయంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడానికి ‘హైపర్‌’ అనే కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు.

హైపర్‌ అంటే..

‘హెచ్‌’ అంటే హెడ్‌ క్వార్టర్‌లో అప్రమత్తంగా ఉండడం, ‘ఎ’ అంటే సిబ్బంది, సామగ్రి సమీకరణ, ‘ఐ’ అంటే సమాచార సేకరణ, చేరవేయడం, ‘పీ’ అంటే పటిష్ట వ్యూహాన్ని అమలు పర్చడం, ‘ఇ’ అంటే నిర్దిష్ట కార్యాచరణ అమలు, ‘ఆర్‌’ అంటే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించడం అని ఎస్‌ఈలు మధుసూదన్‌ రావు, గౌతంరెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement