అడుగులు పడట్లే! | - | Sakshi
Sakshi News home page

అడుగులు పడట్లే!

Mar 21 2025 1:14 AM | Updated on Mar 21 2025 1:15 AM

శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025
ఆర్థికాభివృద్ధి వైపు

IIలోu

తలసరి ఆదాయంలో అంతంతే..

2023–24లోనూ రంగారెడ్డి జిల్లా రూ.10,55,913ల తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా.. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ర్యాంకింగ్‌లో 12 నుంచి 29 స్థానాల్లో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఫర్‌ క్యాపిటల్‌ ఇన్‌కం పెరిగినా.. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గతేడాది రూ.2,28,655లతో 15వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,57,851కు పెరిగినా 12వ స్థానానికి పరిమితమైంది. గతంలో 19వ స్థానంలో ఉన్న ములుగు ఈసారి రూ.2,49,338లతో 15, రూ.2,44,278లతో వరంగల్‌ 17, జనగామ రూ.2,33,215లతో 19, మహబూబాబాద్‌ రూ.2,12,232లతో 29వ స్థానాల్లో నిలవగా, హనుమకొండ జిల్లా రూ.1,99,490లతో 32వ స్థానానికి పడిపోయింది. గతేడాది రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉన్న హనుమకొండ ఈసారి తలసరి ఆదాయంలో మరో మెట్టు దిగింది.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలు 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్ర స్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. జాతీయ ధరల సూచీ ప్రకారం గణించే తలసరి ఆదాయం విషయంలో గతంతో పోలిస్తే కొంత ఫరవాలేదు. జయశంకర్‌ భూపాలపల్లి 15వ స్థానం నుంచి 12వ స్థానానికి చేరింది. అడవుల విస్తీర్ణంలో ములుగు మొదటి, భూపాలపల్లి మూడో స్థానాల్లో నిలిచాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను కల్పించడంలో 9 నుంచి 29 స్థానాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలు నిలిచాయి. అయితే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ద్వారా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో సాగుతున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన, విద్యుత్‌ కనెక్షన్లు, మహిళా, శిశు సంక్షేమంలో ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’ గణాంకాల ఆధారంగా

ప్రత్యేక కథనం.

అడవుల విస్తీర్ణంలో

ములుగు ఫస్ట్‌..

మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ అటవీ ప్రాంతం జిల్లాల వారీగా గణనీయంగా మారిన నేపథ్యంలో అత్యధికంగా 64.64శాతం అటవీ విస్తీర్ణంతో ములుగు మొదటి స్థానంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం (41.38శాతం) రెండో స్థానంలో ఉండగా, ఆ తదుపరి మూడో స్థానంలో 41.15 శాతంతో జయశంకర్‌ భూపాలపల్లి ఉంది. 26.89 శాతంతో అడవులతో మహబూబాబాద్‌ తొమ్మిదో స్థానంలో, 4.44 శాతంతో జనగామ 29, వరంగల్‌ 3.53 శాతంతో 30, హనుమకొండ 3.40 శాతంతో 31వ స్థానంలో ఉంది.

‘ఉపాధి’ పనిదినాల్లో

వెనుకబాటే..

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలు వెనుకబడిపోయాయి. ఈ ఏడాది జనవరి 24 వరకు కూలీలకు పనులు కల్పించడంలో లక్ష్యాలను చేరుకోలేక 9 నుంచి 29వ స్థానాల్లో నిలిచాయి. ర్యాంకింగ్‌లో వరంగల్‌ జిల్లా 25.5లక్షల పనిదినాలకు 23 లక్షల పనిదినాలు కల్పించి 89.9 శాతంతో 9వ స్థానం, ములుగు 89.8 శాతం పని దినాలతో 10వ స్థానాల్లో నిలిచాయి. అలాగే 89.3 శాతం లక్ష్యంతో హనుమకొండ 15, జనగామ 16, జయశంకర్‌ భూపాలపల్లి 88.3 శాతంతో 23, మహబూబాబాద్‌ 47.6 లక్షల పనిదినాలకు 41.8 లక్షల పని దినాలు జనరేట్‌ చేసి 87.8 శాతంతో 29వ స్థానంలో నిలిచాయి.

జీడీడీపీలో అట్టడుగున జిల్లాలు..

ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో 2022–23 సంవత్సరం కంటే 2023–24లో అట్టడుగున నిలిచాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో ఈసారి కూడా పోటీ పడలేకపోయాయి. వరంగల్‌ అర్బన్‌ (హనుమకొండ) గతేడాది రూ.23,868తో 14వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ. 25,667కు జీడీడీపీ పెరిగినా 16వ స్థానంలో నిలిచింది. వరంగల్‌ రూరల్‌(వరంగల్‌) 22, మహబూబాబాద్‌ 24వ స్థానాల్లో నిలిచాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 32, 33వ స్థానంతో ఆఖరి వరుసలో ఉన్నాయి.

జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు.. అట్టడుగున ఆరు జిల్లాలు

తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి

15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం.. గతంతో పోలిస్తే ఫర్వాలేదు

అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్‌.. మూడో స్థానంలో భూపాలపల్లి

తెలంగాణ సోషియో ఎకనామిక్‌ ఔట్‌ లుక్‌ – 2025లో వెల్లడి

న్యూస్‌రీల్‌

జిల్లాల వారీగా తలసరి ఆదాయం ( రూ.లలో)

జిల్లా 2020–21 2021–22 2022–23 2023–24

వరంగల్‌ అర్బన్‌ 1,26,594 1,55,055 1,86,618 1,99,490

వరంగల్‌ రూరల్‌ 1,65,549 1,95,115 2,20,877 2,44,278

జనగామ 1,66,392 1,86,244 2,21,424 2,33,215

మహబూబాబాద్‌ 1,44,479 1,79,057 2,00,309 2,12,232

జేఎస్‌ భూపాలపల్లి 2,03,564 2,34,132 2,28,655 2,57,851

ములుగు 1,55,821 1,75,527 2,15,772 2,44,278

జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..

జిల్లా మొత్తం జనాభా గ్రామీణం పట్టణ/నగరం

హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629

వరంగల్‌ 7,37,148 5,10,057 2,27,091

జనగామ 5,34,991 4,63,634 71,357

జేఎస్‌.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387

మహబూబాబాద్‌ 7,74,549 6,98,173 76,376

ములుగు 2,94,671 2,83,178 11,493

అడుగులు పడట్లే! 1
1/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 2
2/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 3
3/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 4
4/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 5
5/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 6
6/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 7
7/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 8
8/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 9
9/10

అడుగులు పడట్లే!

అడుగులు పడట్లే! 10
10/10

అడుగులు పడట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement