ఆత్మకూరు : పల్లె దవాఖానాలో గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని డీఎంహెచ్‌ఓ అప్పయ్య పేర్కొన్నారు. మండలంలోని పెద్దాపూర్ పల్లె దవాఖానాను మంగళవారం కేంద్ర బృందం సభ్యులు వర్చువల్‌గా పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణం, హెర్బల్ గార్డెన్, బయో వెస్టేజ్, రోగులకు అందించే సేవలు, గర్భిణులకు అందించే వైద్యం, శిశు ఆరోగ్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమం తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాల ద్వారా రోగులకు వైద్య పరీక్షలతోపాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్పందన, వైద్యులు పద్మశ్రీ, పుష్పలీల, నర్సింగరావు, సీహెచ్‌ఓ జునేటి, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య