● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలో రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించను న్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనానికి ఆయ న ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం మా ట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చుతుందని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రూ.200 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీ ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంచినట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వీడి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా అనిత రా మకృష్ణ, మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కుంకుమేశ్వరాలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీ నివా స్, కట్కూరి దేవేందర్‌రెడ్డి తదితరులున్నారు.