
వినియోగదారులకు అండగా..
వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ‘ఈట్ రైట్ ఫుడ్’ అనే అంశంపై వినియోగదారుల్లో చైతన్యం కల్పిస్తూ అండగా నిలుస్తున్నాం. కల్తీ పాలు అమ్మకందారులపై నాలుగు ప్రైవేట్ డెయిరీలపై ఫిర్యాదు చేశాం. దగ్గు మందుల్లో హానికారకాలు, బాటిళ్లపై సమాచారం లేకపోవడం, ప్లాస్టిక్ బాటిళ్లలో విక్రయంపై జాతీయ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాం. అమ్మాయిలను ఆకర్షించి మోసగిస్తున్న స్లిమ్మింగ్ సెంటర్లపై కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీలో ఫిర్యాదు చేశాం.
– సాంబరాజు చక్రపాణి, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి