● న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి క్షమాదేశ్ పాండే
పరకాల: సమానత్వంతోనే మహిళా సాధికరత సాధ్యమని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే అన్నారు. గురువారం పరకాల పట్టణంలో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినో త్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. దేశ జనాభా లో 50 శాతం ఉన్న మహిళలకు ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలని, అప్పుడే సాధికాతర సాధ్యమని పేర్కొన్నారు. పరకాల ఏసీపీ సతీష్‌బాబు మాట్లాడుతూ మహిళల రక్షణకు వివిధ శాఖలతో పాటు పోలీసు శాఖ కూడా పనిచేస్తున్నదని, అవసరమైతే మహిళలు పోలీసు శాఖను సంప్రదించాలని సూచించారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి దామోద ర్, సంస్థ సభ్యులు ఇందిర, రవీందర్, శ్రీలత, మెప్మా, సతీష్, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.