మడికొండ: విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను త్వరలోనే పరిష్కారిస్తామని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్.వి.వేణుగోపాలచారి అన్నారు. కాజీపేట మండలం మడికొండ సబ్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన వినియోగదారుల సమస్యల పరి ష్కార వేదికలో వినతి పత్రాలు స్వీకరించారు. విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను మార్చడం, ఓల్టేజీ హెచ్చు తగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెంపు, నూతన సర్వీసుల మంజూరు తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో మెంబర్ కె.రమేశ్, చరణ్‌దాస్, ఎన్.నరేందర్, మడికొండ ఏఈ వాలు నాయక్, సిబ్బంది లక్ష్మయ్య, దిలీప్‌రెడ్డి, బాబు, కృష్ణ పాల్గొన్నారు.
విద్యుత్ వినియోగదారుల
ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి