● సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: హోలీ పండుగను ఆనందంగా, సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం(నేడు) హోలీ పండుగ సందర్భంగా ఆయన కమిషనరేట్ ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్ధమైన రంగుల ను వినియోగిస్తూ ప్రశాంత వాతావరణంలో వేడుక జరుపుకోవాలని పే ర్కొన్నారు. ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సే వించి వాహనాలు నడపొద్దని, హోలీ అనంతరం యువత స్నానాలకోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో, అనుమతి లే కుండా వ్యక్తులు, మహిళలు,యువతులు, వాహనదారులపై రంగులు చల్లొద్దని, బైకుల, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధి పోలీస్‌స్టేషన్ల ప్రాంతాల్లో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహిస్తామని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు తప్పవని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.