వరంగల్ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్(డీఆర్‌సీసీ) సామర్థ్యాన్ని పెంచాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. బుధవారం కంపోస్టు యార్డును తనిఖీ చేసిన కమిషనర్ పలు సూచనలు చేశారు. డీఆర్‌సీసీ కేంద్రం, కోకాపిట్ యూనిట్ పరిశీలించారు. తప్రతీరోజు టన్ను పొడిచెత్తను తప్పనిసరిగా రవాణా చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తడిచెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కోరారు. కొబ్బరి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అనిల్, సంపత్ రెడ్డి, వావ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ కమిషనర్
అశ్విని తానాజీ వాకడే