ఎస్సైకి గ్రూప్‌–1 ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

ఎస్సైకి గ్రూప్‌–1 ఉద్యోగం

Mar 12 2025 7:16 AM | Updated on Mar 12 2025 7:14 AM

హసన్‌పర్తి: కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మాధవ్‌గౌడ్‌ గ్రూప్‌–1కు ఎంపికయ్యారు. ఇటు ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే.. అటు గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. సోమవారం విడుదలైన గ్రూప్‌–1 పరీక్ష ఫలితాల్లో మాధవ్‌గౌడ్‌ 505 మార్కులు సాధించారు. మెరిట్‌ మేరకు ఆయనకు డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్‌, ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మాధవ్‌గౌడ్‌ స్వస్థలం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్‌పూర్‌. తండ్రి మొగిలి పోస్టల్‌ ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. 2019 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన వరంగల్‌ కమిషనరేట్‌ పరిధి జఫర్‌గడ్‌తో పాటు పలు పోలీస్‌ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇటీవల బదిలీపై కేయూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం భీమారంలోని సత్యసాయికాలనీ–5లో భార్యాపిల్లలతో ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement