
హన్మకొండ: ఓరుగల్లులో విద్య, వైద్యం, ఐటీ, పారిశ్రామికీకరణ మొదలైందని, ఇక ఆగదని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో వరంగల్ ప్రజలు తనకు బలాన్నిచ్చారని, ఈ బలంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపించానన్నారు. మరోసారి తనకు అదే బలాన్ని ఇవ్వాలని కోరారు. మంగళవారం వరంగల్ నగరంలోని కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో బీఆర్‌ఎస్ వరంగల్ పశ్చి మ, తూర్పు అభ్యర్థులు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌ను గెలిపించాలని కోరుతూ.. నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో వరంగల్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. అజంజాహి మిల్లు ను మూసేయడంతో ఆస్థలాన్ని అమ్మిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. తాను వరంగల్ ప్రజలకు ఆ స్థాయి కి తగ్గ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మె గా టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేశానన్నారు. దీంతో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. రాను న్న రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, యూనివర్సిటీలు, విద్యుత్ సంస్థలు రానున్నాయన్నారు. వరంగల్‌లో పెద్దఎత్తున పాడి పరిశ్రమ ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చెప్పానన్నారు. నగరంలో దుమ్ముధూళి పోయి బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయన్నారు. కాళోజీ పేరిట వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశానన్నారు. దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్ వరంగల్ ప్రజలు పెంచి పోషించిన బీసీ బిడ్డలని, ప్రజలంతా ఏకమై ఇద్దరిని గెలిపించాలన్నారు. చీఫ్ విప్ అయిన వినయ్‌భాస్కర్ హైదరాబాద్‌లో ఉండాల్సి ఉండగా.. వచ్చి హనుమకొండలోనే, ప్రజల మధ్య ఉంటున్నాడన్నారు. ‘ఆటోలపై దాస్యం మా ధైర్యం’ అని రాసుకోవడాన్ని తాను చూశానన్నారు. ఎంత ప్రేమ, ప్రజలకు అండగా ఉంటేనే ఇలా రాసుకుంటారన్నారు.
నిరంతర అభివృద్ధి
వరంగల్ అభివృద్ధి మొదలైందని, ఇక ఆగదని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ఇప్పుడు ప్రతి రోజూ వస్తుందన్నారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు రైల్వే లైన్ చాలాదూరం ఉందని, ఈ రైల్వేలైన్‌పై 6 ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు అవసరమని, మళ్లీ అధికారంలోకి రాగానే నిర్మిస్తామన్నారు. 20 అంతస్తులతో అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని, హైదరాబాద్‌లో కూడా ఇంత పెద్ద ఆస్పత్రి లేదని, హైదరాబాద్‌కు వచ్చే రోగులు కూడా ఇక్కడికే రావాల్సి ఉంటుందన్నారు. 14 రకాల రోగాలకు చికిత్సలు అందించనున్నట్లు చెప్పారు. తూర్పు తెలంగాణ ప్రజలందరికీ వైద్యసేవలు అందుతాయన్నారు. సభలో రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, నాయకులు బొల్లం సంపత్‌కుమార్, మౌలానా జాహీద్, నాగుర్ల వెంకటేశ్వర్లు, దోనెపూడి రమేశ్ బాబు, రిజ్వానా షమీమ్, మర్రి యాదవరెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, జనార్దన్‌గౌడ్ పాల్గొన్నారు.
అభివృద్ధి మొదలైంది.. ఇక ఆగదు
కాంగ్రెస్‌తో కుంటుపడిన
వరంగల్ అభివృద్ధి
మున్ముందు నగరానికి
ఉజ్వల భవిష్యత్
పెద్ద ఎత్తున రానున్న ఐటీ,
పరిశ్రమలు, యూనివర్సిటీలు
ఇక్కడి ప్రజల బలంతోనే
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించా
ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
సభ సైడ్‌లైట్స్
మధ్యాహ్నం 1.10 గంటలకు సీఎం కేసీఆర్ సభాప్రాంగణానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
1.25 గంటలకు ప్రసంగం ప్రారంభం
1.52 గంటలకు ప్రసంగం ముగింపు
26 నిమిషాలపాటు ప్రసంగం కొనసాగింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోటలో జరిగిన ఘటనను గుర్తు చేసుకుని వీరికి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్‌కు వన్నె తీసుకొచ్చేలా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని అమలు చేశామని తెలిపారు.
రాజముద్రలో కాకతీయ తోరణాన్ని
చేర్చామన్నారు.
తెలంగాణ ఏర్పాటు కావాలని భద్రకాళి అమ్మవారికి మొక్కుకున్నానని, రాష్ట్రం ఆవిర్భవించగానే మొక్కు తీర్చుకున్నానని తెలిపారు.
వరంగల్ సభ 95వ ది అని పేర్కొన్నారు.
నన్నపునేని నరేందర్ వేదికపై నుంచి
సభికులకు సాష్టాంగ నమస్కారం చేశారు.
వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజక వర్గాలనుంచి భారీగా జనం తరలివచ్చారు.
ప్రజలే నాబలం, బలగం: వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి జరుగుతోందని వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తనను నియోజకవర్గ ప్రజలు వారిలో ఒకరిగా చూసుకున్నారని, నా బలం, బలగం ప్రజలేనన్నారు. సీఎం కేసీఆర్ సహాయంతో గుడిసెవాసులకు పట్టాలిప్పించానన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారని, వారికి కూడా ఇప్పించాలని సీఎంను కోరారు. పేద, మధ్య తరగతి వారికి ఇళ్లు కావాలని కోరారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదన్నారు. ప్రజలకు సేవకుడిగా పని చేశానన్నారు. మళ్లీ గెలిపించాలని కోరారు.
లారీడ్రైవర్ కుమారుడిని ఈ స్థాయికి
తీసుకొచ్చారు : వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్
లారీ డ్రైవర్ కుమారుడి నైన తనను ఎమ్మెల్యే స్థాయికి.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మైనార్టీలకు అవకాశాలు కల్పించాలన్నారు. విద్య, వైద్యంలో వరంగల్‌ను ఉత్తర తెలంగాణకు తలమానికంగా సీఎం కేసీఆర్ నిలిపారన్నారు. తనను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సభా వేదికపై నృత్యం చేస్తున్న మహిళా కార్పొరేటర్లు


సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్, పక్కన అభ్యర్థులు వినయ్‌భాస్కర్, నరేందర్



Comments
Please login to add a commentAdd a comment