
మార్చ్‌ఫాస్ట్ చేస్తున్న క్రీడాకారులు
కమలాపూర్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బీసీ సంక్షేమ శాఖ డీడీ జి.రాంరెడ్డి సూచించారు. కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఎంజేపీ గురుకుల పాఠశాలల (అండర్–17 బాలురు) ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రాంరెడ్డి, ఇన్‌స్పెక్టర్ బి.సంజీవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ జెండాను ఎగురవేసి ఒలింపిక్ టార్చ్‌ను వెలిగించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటుకోవాలన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి ఎంజేపీ సొసైటీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ఇన్‌స్పెక్టర్ సంజీవ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయన్నారు. అనంతరం ఇద్దరు అధికారులు క్రీడా పోటీలను ప్రారంభించి పీఈటీలు, క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 15 పాఠశాలల నుంచి 600 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఓదెల మ
ల్లయ్య, ఎంజేపీ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీ నర్ సరిత, ఎంజేపీ ప్రిన్సిపాళ్లు ప్రపుల్లాదేవి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, పీఈటీలు నాగరాజు, వెంకటేష్, కిశోర్‌కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ
డైరెక్టర్ రాంరెడ్డి
కమలాపూర్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీలు ప్రారంభం

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న బీసీ సంక్షేమ శాఖ డీడీ రాంరెడ్డి