
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య
ఖిలా వరంగల్: నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో సాధించాలని కలెక్టర్ ప్రావీణ్య వివిధ బ్యాంకు అధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ, వివిధ బ్యాంకులకు నిర్ధేశించిన లక్ష్యాల సాధింపుపై గురువారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. రైతు ఖాతాల్లో డబ్బులు జ మ అయ్యాయా.. లేదా.. పంట రుణాలు రెన్యూవ ల్ చేసుకున్నారా.. లేదా.. అనే విషయాన్ని వ్యవసా య క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎరువుల నిల్వ నివేదికలను పరిశీలించి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఉద్యానవన శాఖ పర్యవేక్షణలో ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. 700 ఎకరాలకు మంజూరు ఇచ్చి నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు 125 ఎకరాల్లో రైతులను గుర్తించి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. ప్రతి 1,000 ఎకరాలకు ఒక ఫీల్ట్ ఆఫీసర్ ఉండాలని, 13 మండలాలకు 13 మంది ఉండేలా చూసుకుని శాఖాపరమైన లక్ష్యాల ను పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే యా సంగి పంటలకు అక్టోబర్ 15వరకు రైతుల నుంచి దరఖాస్తులు, రైతు వాటాను డీడీ రూపంలో చెల్లించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టా లన్నారు. అనంతరం వ్యవసాయశాఖ జిల్లా అధికా రి ఉషాదయాళ్ మాట్లాడారు. జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి 2,800 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 1,450 మొక్కలు గ్రౌండింగ్ అయ్యాయని, 2,100 ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. 700 ఎకరాలకు సంబంధించిన రైతు దరఖాస్తులు, నాన్ సబ్సిడీ నిధులను సేకరించాలని మండల ఉద్యానవన శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులను కోరారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. అంబేడ్కర్ జంక్షన్, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, వైకుంఠధామం, దోభీఘాట్, మున్సిపల్ భవన నిర్మాణం తదితర వాటిని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు. పనులు వేగంగా.. నాణ్యతగా చేయాలని ఆదేశించారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, ఓటరు జాబితాలో లేని పక్షంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఓటర్ సవరణ వివరాలను పరిశీలించారు. వర్ధన్నపేట ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జోనా పాల్గొన్నారు.
ఓటరు జాబితా వేగంగా రూపొందించాలి
ఓటరు జాబితా రూపకల్పనలో వేగం పెంచాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఖిలా వరంగల్ తహసీల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఫారం 6, 7, 8 దస్త్రాల ప్రక్రియను పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించాల ని సూచించారు. అనంతరం శివనగర్‌లోని 110, 118, 120, 167, 170, 186 పోలింగ్ కేంద్రాలను తహసీల్ధార్ నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా బూత్‌లలో బీఎల్‌ఓలు నమోదు చేసిన ఫారం 6, 7, 8ల రిజిష్టర్లను కలెక్టర్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయ, ఉద్యానవన శాఖ సమీక్ష
సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య

ఓటరు నమోదు రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్