వరంగల్: ఇండిగ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు– 2023కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికై నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈనెల 22, 23 తేదీ ల్లో వర్చువల్‌గా ఢిల్లీ నుంచి అవార్డు అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు గురువారం తెలిపారు. అమ్మవారిపేటలో మల, బురద ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ), శానిటేషన్ రిసోర్స్ పార్కు అభివృద్ధి చేసినందుకు ఇండిగ్లోబల్ సంస్థ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేసినట్లు బల్దియా అధికారులు పేర్కొన్నారు. గ్రేటర్ అవార్డుకు ఎంపిక కావడంపై మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవార్డు రావడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, బల్దియా కమిషనర్, అధికారులు సహకారం అందించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడేళ్ల క్రితమే అమ్మవారిపేటలో ఎఫ్ఎస్టీపీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.