కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ, సీఈసీ, ఏసీఈ గ్రూపుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉన్నాయని.. 10వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31 వరకు https://tgms .telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేపు జిల్లాస్థాయిక్రీడాకారుల ఎంపికలు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో గురువారం సబ్ జూనియర్ అథ్లెటిక్స్, సీనియర్స్ విభాగం జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలు జరగనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో 17వ తేదీన జరగబోయే 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. అండర్ 8లో 60 మీటర్లు, 200 మీటర్లు, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, అండర్–10లో 60 మీటర్లు, 300 మీటర్లు, లాంగ్ జంప్ (5 మీటర్స్ అప్రోచ్ రన్), అండర్–12లో 60 మీటర్లు, 400 మీటర్లు, లాంగ్ జంప్ (5 మీటర్స్ అప్రోచ్‌రన్), షాట్‌పుట్ (బ్యాక్ త్రో), అండర్–14లో ట్రయాథ్లాన్–ఏ,బీ,సీ, కిడ్స్ జావెలిన్ త్రో ఎంపికలు ఉండనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 3వ తెలంగాణ రాష్ట్రస్థాయి జంప్స్, త్రోస్, 400 మీటర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు అండర్–16 బాలబాలికల లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, అండర్–18 లాంగ్‌జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, షాట్‌పుట్, జావెలిన్, డిస్కస్ త్రో, 400 మీటర్స్, అండర్–20లో లాంగ్‌జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, షాట్‌పుట్, జావెలిన్, డిస్కస్ త్రో, 400 మీటర్స్, మెన్ అండ్ ఉమెన్స్‌కు లాంగ్‌జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, జావెలిన్, డిస్కస్ త్రో, హేమర్ త్రో, 400 మీటర్స్, షాట్‌పుట్ ఎంపికలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 7 గంటలకు గ్రౌండ్‌లో రిపోర్ట్ చేయాలని, మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 80961 15222, 94413 53375 సంప్రదించాలని సూచించారు.
ప్రజాభవన్ ప్రజావాణిలో గణప సముద్రం రైతులు
ఖిల్లాఘనపురం: నష్ట పరిహారం చెల్లించాలంటూ మంగళవారం గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వారం రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పడంతో 2025, జూలైలో అవార్డు కాపీలపై సంతకాలు చేశామన్నారు. 100 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లింకపోవడంతో కలెక్టర్‌ను కలిశామని.. జిల్లాలో చేయాల్సిన ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారన్నారు. కలెక్టర్ దగ్గర టోకన్ నంబర్ తీసుకొని 2025, నవంబర్ 5న ప్రజావాణిలో ఫైనాన్స్ డిపార్డుమెంట్‌కు లేఖ అందించడంతో పాటు మండల కేంద్రంలో బంద్, రాస్తారోకో చేపట్టామని వివరించారు. అయినా ఇప్పటి వరకు పరిహారం అందలేదని.. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే చెల్లించాలని, న్యాయం జరిగేలా చూడాలని చిన్నారెడ్డిని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ముంపురైతుల అధ్యక్షు డు రవీందర్‌రెడ్డి, రాళ్ల కృష్ణయ్య, కటికె శ్రీనివాసులు, గగ్గలపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గగ్గలపల్లి శేఖర్‌రెడ్డి, సౌడం రాములు, నల్లమద్ది సురేందర్‌రెడ్డి, గంగాపురం రాజురెడ్డి, దేవరశెట్టి సురేందర్, పలువురు రైతులు ఉన్నారు.
రేపు బాక్సింగ్
క్రీడాకారుల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి అండర్–19, అండర్–22 బాలబాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బొంబాయి నర్సింహులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు 10 వెయిట్ కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని, 7వ తేదీ(గురువారం) ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు.


