‘భూ భారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

‘భూ భారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి

May 6 2026 7:49 AM | Updated on May 6 2026 7:49 AM

వనపర్తి: జిల్లాలో భూ భారతి పెండింగ్‌ దరఖాస్తులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ భారతి పెండింగ్‌ దస్త్రాలను లాగిన్‌కు పంపడంతో పాటు కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. అలాగే సాదాబైనామా దరఖాస్తులను జీఓనంబర్‌ 76, 77 ప్రకారం పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి మండలాల వారీగా ప్రత్యేక జాబితా సిద్ధం చేయాలని కోరారు. జిల్లాలోని 472 రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, హౌసింగ్‌ పీడీ విఠోభా పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

Advertisement
 
Advertisement
Advertisement