అమృత్‌ 2.0 పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ 2.0 పనులు వేగవంతం

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

కొత్తకోట రూరల్‌: అమృత్‌ 2.0 పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన వనపర్తి, కొత్తకోట పురపాలికల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించి పురోగతిపై సమీక్షించారు. పర్యవేక్షణలో నిర్లక్ష్యం సరికాదని.. ప్రతి దశలో పనులు పరిశీలించాలని స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. పనులు వేగంగా పూర్తిచేసి గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట కొత్తకోట మున్సిపల్‌ కమిషనర్‌ సైదయ్య, స్థానిక నాయకులు పి.కృష్ణారెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎన్‌జే బోయేజ్‌, సీడీసీ మాజీ చైర్మన్‌ చెన్నకేశవరెడ్డి, బాదం వెంకటేశ్వర్లు, పెంటన్నయాదవ్‌, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

వేరుశనగ క్వింటా రూ.7,392

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్‌కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement