వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్: కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన మిల్లు, గోదాంకు తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం ఆయన వనపర్తి మండలం చిట్యాల మార్కెట్‌యార్డు, కొత్తకోట మండలం వడ్డేవాట, సంకిరెడ్డిపల్లి, ముమ్మళ్లపల్లిలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే ధాన్యం రికార్డులను పరిశీలించి నమోదుపై నిర్వాహకులకు సూచనలు చేశారు. ధాన్యంలో తాలు, గడ్డి, మట్టిపెడ్డలు లేకుండా క్లీనర్లను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. చాలాచోట్ల తాలు, మట్టి, గడ్డి ఎక్కువగా కనిపిస్తుందని.. అలా ఉంటే మిల్లర్లు ధాన్యంలో కోత విధించేందుకు ఆస్కారం ఉండదని, రైతులు శుభ్రం చేసి తీసుకురావాలన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేయాలని, ట్యాబ్‌ఎంట్రీ ప్రక్రియ వేగంగా జరగాలని, తద్వారా నగదు చెల్లింపుల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ చాంద్‌పాషా, కొత్తకోట పీఏసీఎస్ సీఈఓ బాలరాజు, ఆయా కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్


