అంతరాయం కలగకుండా చూస్తాం..
సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. వీటిని కోతలుగా పరిగణించొద్దు. మంగళవారం రాత్రి 33 కేవీ బ్రేక్‌డౌన్ కావడంతోనే సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎలాంటి అనధికార విద్యుత్ కోతలు విధించడం లేదు. వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో బ్రేక్‌డౌన్ అవుతుంది. వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి సరఫరాలో అంతరాయం కలగకుండా మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నాం.
– రాజశేఖరం, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ


