కలెక్టరేట్‌కు తిరుగుతున్నాం..
బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు ఎంపికయ్యా. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదని దసరా సెలవుల తర్వాత పాఠశాలకు రానివ్వడం లేదు. భోజనం, టిఫిన్ అందించలేమని.. హాస్టల్‌కు రావొద్దని తేల్చి చెప్పారు. డే స్కాలర్స్‌గా వచ్చి వెళ్లాలని యాజమాన్యం సూచిస్తోంది. దీంతో చేసేది లేక రోజు కలెక్టరేట్‌లో అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. పాఠ్యాంశాలను మిస్ అవుతున్నాం.
– యశ్వంత్, 7వ తరగతి
మా అమ్మాయి ఐదేళ్లుగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతోంది. ప్రస్తుతం పదో తరగతి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని యాజమాన్యాలు పాఠశాలకు రానిచ్చేందుకు విముఖత చూపుతున్నాయి. గందరగోళ పరిస్థితులు తలెత్తి పిల్లలతో పాటు మేము మానసికంగా కుంగిపోతున్నాం.
– గంధం రవి, విద్యార్థి తండ్రి
కలెక్టరేట్‌కు తిరుగుతున్నాం..


