మత్స్యబీజానికి అనాసక్తి! | - | Sakshi
Sakshi News home page

మత్స్యబీజానికి అనాసక్తి!

Jul 13 2025 4:31 AM | Updated on Jul 13 2025 4:31 AM

మత్స్

మత్స్యబీజానికి అనాసక్తి!

చేప పిల్లల స్థానంలో నగదు ఇవ్వాలని డిమాండ్‌

నగదు చెల్లించాలి..

రాయితీ చేప పిల్లలకు బదులు సరిపడా నగదు చెల్లిస్తే బాగుంటుంది. అవే డబ్బులతో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న చేప పిల్లల రకాలు కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకొనే వీలుంటుంది. ఏడాది పాటు చెరువులో నీరు ఉండటంతో చేపల బరువుతో పాటు సైజు పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

– రవికాంత్‌, కార్యదర్శి,

అమరచింత మత్స్య సహకార సంఘం

ప్రభుత్వం ఆదుకోవాలి..

జూరాల జలాశయంలో తమ జాలర్లు చేపలు పట్టుకొని జీవిస్తున్నారు. దీంతోపాటు గ్రామంలోని చెరువులో సైతం చేపలు పెంచుకుంటున్నాం. ప్రభుత్వం ఈసారి నగదు రూపంలో సొసైటీకి అందిస్తే మత్స్యకారులే నాణ్యమైన చేప పిల్లలు కొనుగోలు చేసుకుంటారు.

– శ్రీధర్‌, నందిమళ్ల మత్స్య సహకార సంఘం

ఎలాంటి సమాచారం లేదు..

రాయితీ చేప పిల్లల పంపిణీ, మత్స్యకార సొసైటీలకు నగదు జమపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. మత్స్యకారులు మాత్రం చాలాసార్లు తమకు నగదు ఇవ్వమని డిమాండ్‌ చేస్తున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.

– డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ

అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీని మాని సంఘాలకు నగదు ఇవ్వాలని.. వాటితో తమకు నచ్చిన మత్స్య బీజాన్ని చెరువులు, కుంటల్లో వదులుకుంటామని జిల్లా మత్స్యకారులు కోరుతున్నారు. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన రాయితీ చేప పిల్లలు ఆశించిన మేర పెరగక.. లాభాలు రాక కుటుంబ పోషణ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ప్రభుత్వం మత్స్య సహకార సొసైటీలకు 50 శాతం చేప పిల్లలు పంపిణీ చేసి చేతులు దులుపుకొందని.. మరి కొన్నింటికి అసలే ఇవ్వలేదని చెబుతున్నారు. చేప పిల్లల పోషణకు అనువైన పరిస్థితులున్నా.. అవి కేవలం అర కిలో, కిలో బరువు వరకే పెరగడం ఏమిటని మత్స్యశాఖ అధికారులను ప్రశ్నిస్తుండగా, ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించగా.. వారే చేప పిల్లలను చెరువులు, జలాశయాలల్లో వదిలారే తప్ప ఎంపికలో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు మత్స్యకారులు జీవనం పొందాలంటే ప్రభుత్వం ఈసారి నగదు అందించాలన్న డిమాండ్‌ అధికమైంది.

చేపల వేటతోనే కుటుంబ పోషణ..

మత్స్యకారులు నిత్యం చేపలు పట్టి విక్రయించి వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని రామన్‌పాడు, జూరాల, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌తో పాటు చిన్న చిన్న చెరువులు, నీటికుంటల్లో చేపలు పట్టుకొని వేలాది మంది జాలర్లు కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోరమీను, బంగారు తీగ, రొయ్యలు అధికంగా లభించక పోవడంతో కేవలం బొచ్చజాతి చేపలను విక్రయిస్తున్నారు.

● గ్రామాల్లోని నీటి కుంటలు, చెరువుల్లో గ్రామస్తుల సహకారంతో మత్స్యకారులు చేపలు పెంచుకుంటున్నారు. అతిపెద్ద సొసైటీలు సైతం జలాశయాల్లో చేపలు పట్టి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ వచ్చే ఆదాయంతో సొసైటీల నిర్వహణతో పాటు సభ్యులకు రోజువారి వేతనాలు అందిస్తూ కొనసాగిస్తున్నారు. అయితే సొసైటీలకే ప్రభుత్వం నేరుగా నగదు అందిస్తే మేలు రకం చేప పిల్లలు కొనుగోలు చేసుకుంటామంటున్నారు.

జిల్లాలో ఇలా..

గ్రామాలు 255

రిజర్వాయర్లు, చెరువులు, 1,052

కుంటలు

మత్స్య సహకార సంఘాలు 143

మత్స్యకారులు 13,600

చేపల విక్రయదారులు సుమారు 20 వేలు

నాసిరకంతో నష్టపోతున్నామన్న వాదన

నచ్చిన సీడ్‌ తెచ్చుకుంటామంటున్న మత్స్యకారులు

గతేడాది 50 శాతం మాత్రమే పంపిణీ

జిల్లాలో 13,600 మంది

మత్స్యకారులు

గతేడాది పంపిణీ ఇలా..

గతేడాది జిల్లాలో 50 శాతం మేర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసింది. 58 లక్షల చేప పిల్లలకుగాను రూ.89,40,011 వెచ్చించింది. ఈసారి సొసైటీలకు ఇచ్చే చేప పిల్లల ఆధారంగా చిన్న వాటికి రూ.50 వేల నుంచి రూ.లక్ష, పెద్ద పొసైటీలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తే మేలురకం మత్స్యబీజం కొనుగోలు చేస్తామని చెబుతున్నారు.

మత్స్యబీజానికి అనాసక్తి! 1
1/3

మత్స్యబీజానికి అనాసక్తి!

మత్స్యబీజానికి అనాసక్తి! 2
2/3

మత్స్యబీజానికి అనాసక్తి!

మత్స్యబీజానికి అనాసక్తి! 3
3/3

మత్స్యబీజానికి అనాసక్తి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement