
యువత క్రీడల్లోనూ రాణించాలి
ఆత్మకూర్: యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టిసారించి జాతీయస్థాయిలో రాణించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని మోట్లంపల్లిలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలకు కులం, మతం, వర్గ విభేదాలు ఉండవని, ప్రతిభ ఉన్నవారు అవలీలగా రాణిస్తారని తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని.. లక్ష్యంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. పోటీల్లో మొత్తం 40 జట్లు తలపడగా మొదటి బహుమతి ఆరేపల్లి జట్టు, ద్వితీయ బహుమతి దేవరపల్లి జట్లు సాధించాయి. వీరికి నగదుతో పాటు జ్ఞాపికలు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో రహ్మతుల్లా, పరమేష్, తులసిరాజ్‌యాదవ్, నల్గొండ శ్రీను, చెన్నయ్యసాగర్, గంగాధర్‌గౌడ్, ఆనంద్‌గౌడ్, రవికుమార్, గోవర్ధన్, నిర్వాహకులు పాల్గొన్నారు.