పోలీసులంతా ఒకే కుటుంబం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీసులంతా ఒకే కుటుంబం : ఎస్పీ

May 4 2025 6:31 AM | Updated on May 4 2025 6:31 AM

పోలీసులంతా ఒకే కుటుంబం : ఎస్పీ

పోలీసులంతా ఒకే కుటుంబం : ఎస్పీ

వనపర్తి: యూనిఫామ్‌ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ ఒకే కుటుంబమని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. శనివారం సాయుద దళ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ కార్యాలయ పరేడ్‌ మైదానంలో అన్ని పోలీస్‌స్టేషన్ల సివిల్‌, ఆర్మూడ్‌ రిజర్వ్‌ పోలీస్‌, హోంగార్డ్‌ సిబ్బందికి ఆర్మీ డ్రిల్‌, ఫూట్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై పోలీసు, హోంగార్డుల పరేడ్‌ నిర్వహించి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సిబ్బంది, అధికారులు సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, శక్తి సామరా్‌థ్య్‌లతో పాటు అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని తెలిపారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని.. మంచి జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్తర్తిస్తూ జిల్లాకు, తెలంగాణ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సిబ్బంది విధులు, చేయకూడని పనుల గురించి వివరించారు. కార్యక్రమంలో మెదక్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేశ్‌, రిజర్వ్‌ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్‌, సీసీఎస్‌ ఎస్‌ఐ జయన్న, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ అంజద్‌, రిజర్వ్‌ ఎస్‌ఐ వినోద్‌, శిక్షణ ఎస్‌ఐలు, జిల్లా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement