అమరచింత: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి మరాఠి అశోక్‌కుమార్ కోరారు. ఆదివారం ఆత్మకూర్ మండలం మూలమళ్లలో నిర్వహించిన బూత్‌స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం నిరంకుశ పాలనను ఎండగట్టాలన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దుల రాజు, ఫ్లోర్ లీడర్ అశ్విన్‌కుమార్, జిల్లా నాయకుడు భీంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నరాయుడు, తిమ్మన్న, నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.